సన్ రైజర్స్ టీమ్‌కు గారెలు తినిపించిన యాంకర్ సుమ

0
67

ఐపీఎల్ సమరానికి జట్లన్నీ సన్నద్ధమవుతున్నాయి. ఆయా జట్ల ఆటగాళ్లు, ప్రాక్టీస్, ప్రమోషన్స్ పేరిట బిజీబిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాళ్లు కూడా తీరికవేళల్లో యాడ్ షూటింగుల్లో పాల్గొంటున్నారు.

తాజాగా, ప్రముఖ టెలివిజన్ యాంకర్ సుమతో కలిసి ఓ యాడ్ ఫిలిమ్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు? షూటింగ్‌లో సందడి చేశారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ అనే తేడా లేకుండా ఎంతో సరదాగా ఉండే సుమ డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్ వంటి అగ్రశ్రేణి క్రికెటర్లతో ఎంతో ఉత్సాహంగా యాడ్ చిత్రీకరణలో పాల్గొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయ వంటకాలైన మినప గారెలు, వడలను ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు వార్నర్‌కు రుచి చూపించింది సుమ. భువనేశ్వర్ కుమార్ కూడా ఈ యాడ్‌లో భాగంగా రుచికరమైన వంటకాలను టేస్ట్ చేశాడు.

సన్ రైజర్స్ టీమ్‌కు మార్గదర్శి వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఈ వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సుమ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయగా అవి వైరల్ అవుతున్నాయి.