అల్లు అర్జున్‌కు తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్

0
56
tabu
tabu

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. పూర్తి యాక్షన్.. ఎమోషన్‌తో కూడిన కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది.

ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేసి, ఫస్టు షెడ్యూల్‌ను పూర్తి చేస్తారట.

ఇప్పటికే ముఖ్యమైన పాత్రల కోసం తమిళనటుడు సత్యరాజ్.. మలయాళ నటుడు జయరామ్.. రాజేంద్ర ప్రసాద్.. రావు రమేష్.. సీనియర్ నరేశ్‌లను తీసుకున్నారు. అయితే ఈ చిత్రంలో తల్లిపాత్రకి చాలా ప్రాధాన్యత ఉందట.

అందుకే ఈ పాత్రకి సీనియర్ హీరోయిన్‌ను తీసుకుందామనే ఉద్దేశంతో, ‘టబు’ను సంప్రదిస్తున్నారట. ఆమె ఎంపిక దాదాపు ఖరారు కావొచ్చని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇంతకుముందు నదియా .. ఖుష్బూలాంటి వారిని తీసుకొచ్చిన త్రివిక్రమ్, ఇప్పుడు ‘టబు’ను రంగంలోకి దింపుతున్నాడన్న మాట.