బరువును ఇలా తగ్గించుకోండి…

0
75
Exercise
Exercise

చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ బరువును తగ్గించుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా, వివిధ రకాల వ్యాయామాలతో పాటు ఆహార నియమాలు పాటిస్తుంటారు. నిజానికి చిన్నపాటి చిట్కాలు పాటించినట్టయితే అధిక బరువు నుంచి సులభంగా విముక్తి పొందవచ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇపుడు పరిశీలిద్ధాం.

* అధిక బరువుతో ఉండేవారు మొదటి చేసే పని ఉదయాన్నే అల్పాహారాన్ని మానేయడం. ఇలా చేయడం కేవలం ఒక భ్రమ మాత్రమే. ఇది ఎంత‌మాత్రం నిజం కాదు. ఉద‌యం ఖచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. లేదంటే రోజులో త‌ర్వాతి స‌మ‌యాల్లో అధికంగా ఆహారం తీసుకుంటార‌ని, దాంతో అధిక బ‌రువు పెరుగుతారని వైద్యులు ప్రయోగాత్మకంగా నిరూపించారు. కాక‌పోతే అందులో ప్రోటీన్లు, ఫ్యాట్లు స‌మ‌పాళ్ల‌లో ఉండేలా చూసుకోవాలి.

* తక్షణం అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు శీత‌ల పానీయాల‌ను అస్సలు ముట్టుకోరాదు. ఇవి బ‌రువును పెంచుతాయి.

* చాలా మంది నిత్యం వ్యాయామం చేస్తున్నాం క‌దా అని చెప్పి ఆహారాన్ని బాగా లాగించేస్తుంటారు. అది మంచిది కాదు. వ్యాయామం చేసినా స‌రే ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం మాత్రమే తీసుకోవాలి.

* ముఖ్యంగా, జంక్ ఫుడ్ శ‌రీరానికి చేటు తెస్తుంది. బ‌రువును పెంచుతుంది. క‌నుక ఆ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

* వారంలో ఒక రోజు ఖచ్చితంగా ఉప‌వాసం ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే.. ఆ రోజున శ‌రీరం మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంది. మెట‌బాలిజం క్ర‌మ‌బ‌ద్దీక‌రింప‌బ‌డుతుంది.

* కొంద‌రు బాగా ఎక్స‌ర్‌సైజ్ చేస్తే అధికంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని భ్ర‌మిస్తుంటారు. అది నిజం కాదు. శ‌రీరానికి ఎంత వ్యాయామం అవ‌స‌రం అని భావిస్తారో అంత వ‌ర‌కే వ్యాయామం చేయాలి. దీని వ‌ల్ల బ‌రువు తగ్గుతారు.