వేసవిలో సబ్బుతో స్నానం వద్దు.. సున్నిపిండితో చేస్తే..

0
85

వేసవి కాలం ఆరంభానికి ముందే పగటి ఉష్ణోగ్రతు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో చర్మం కమిలి పోకుండా, తేమగా ఉండాలంటే కొన్నిపాటి చిట్కాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా, ఎండలో తిరిగేవారు కనీసం మూడు నాలుగు లీటర్ల తాగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

* పెరుగును క్రమం తప్పకుండా వాడుకోవాలి.
* వేసవిలో పుచ్చకాయలు, కొబ్బరి నీళ్లు, ఫలరసాలు వంటివి అధికంగా తాగాలి.
* ఈ రసాలను తాగడం వల్ల శరీరానికి చల్లదనం చేకురుతాయి.
* సబ్బుకు బదులు సున్నిపిండి స్నానం ఎంతో మంచిది.
* ఎండవేడిమికి వెంట్రుకలు చిట్లిపోవడం, రంగు మారిపోవడం జరుగుతుంటాయి.
* ఎండలో తిరుగుతున్నప్పుడు జుట్టును గుడ్డతో కప్పుకోవాలి.
* ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల అటు ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూనే.. వడదెబ్బబారిన పడకుండా ఉండొచ్చు.