ప్రతి ఒక్కరూ విధేయతతో పని చేయాలి : హీరో నరేష్

0
57

మా అధ్యక్షుడుగా తాను, కమిటీ సభ్యులుగా మిగిలిన వారంతా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుంటామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ అన్నారు. మా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 25 సంవత్సరాలుగా మా అభివృధ్ధికోసం ఎంతో మంది అధ్యక్షులు కృషి చేశారు. వారందరికీ ధన్యవాదాలు.. మా ప్రతిష్టని మరింత పెంచేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను అని చెప్పారు.

మా అసోసియేషన్‌లో ఉన్న ప్రతిఒక్కరు ఎంతో సంతోషంగా ఉండాలి. ఇది జరగాలంటే ప్రతిఒక్కరు క్రమశిక్షణతో, విధేయతతో గౌరవంతో పనిచేయాలి.. ‘మా’ గీతం నేను ‘ మా ‘ అమ్మకి ఇచ్చే మొదటి బహుమతి.. రెండో బహుమతిగా నా నుంచి ఒక లక్ష వెయ్యి నూటపదహార్లు నా సోదరుల సంక్షేమం కోసం ఇస్తున్నాను.. మా అమ్మ విజయనిర్మల గారు ప్రతినెలా 15000 ఇస్తున్నారు.. మా అసోసియేషన్ మా ఇంట్లో మొదలైంది.. అలాంటి ‘ మా ‘అమ్మ ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత నాది. మా అసోసియేషన్ సభ్యత్వం ఇందుకు ముందు ఉన్న దానికంటే 10,000 వేలు తగ్గిస్తూ 90,000 చేస్తున్నాం. ఇది నా మూడో గిఫ్ట్..

24 హావర్స్ హెల్ప్ లైన్‌ని ఏర్పాటు చేసాం. ఫిర్యాదులు, సలహాల బాక్సును ఏర్పాటు చేసి అందరి విన్నపాలు స్వీకరిస్తాం. మహిళల సాధికారత కోసం, వారి సంక్షేమం కోసం జీవిత ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అలాగే శివబాలాజీ ఇన్‌ఛార్జ్‌గా యూత్‌‌ని లీడ్ చేసే ఓ కార్యక్రమం చేస్తున్నాం. జాబ్ కమిటీని గౌతమ్ రాజు లీడ్ చేస్తూ అందరికి ఉపాధి లభించేలా చేస్తున్నాం. పెన్షన్‌ని వెయ్యి రూపాయలు పెంచుతున్నాం. ప్రతినెలా మెడికల్ క్యాంపును ఏర్పాటుచేస్తున్నాం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి చాలా కృతజ్ఞతలు. మేము వెళ్లిన వెంటనే స్పందించి ఏ సహాయం కావాలన్నా చెప్పండి అని అన్నివిధాలుగా సహకరించిన వారికి, తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.