రకుల్ ప్రీత్ సింగ్ వెండితెరకు పరిచయమై పదేళ్ళు పూర్తయింది. తెలుగులోనూ చూస్తుండగానే ఎనిమిదేళ్ళు గడిచిపోయాయి. చిన్న హీరోల సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి స్టార్ హీరోల సరసన గ్లామర్ పండించింది.
అయితే ఆమె దురదృష్టం ఏమో కానీ పెద్ద హీరోలతో నటించిన సినిమాలు అమ్మడికి ఆశించినంత విజయాన్ని అందించలేదు. అంతేకాదు మెగా ఫ్యామిలీలోకి ‘బ్రూస్ లీ’ మూవీతో అడుగుపెట్టిన రకుల్‌కు తొలి యత్నమే బెడిసి కొట్టింది. అయితే అల్లు అర్జున్ సరసన రకుల్ నటించిన ‘సరైనోడు’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమె ఊపిరిపీల్చుకుంది.
అయితే, ఈమెలో మంచి గుణమేమిటంటే…ఇటు దర్శకనిర్మాతలతోనే కాదు తన చిత్ర కథానాయకులతోనూ సత్ సంబంధాలు కలిగి ఉంటుంది. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెతో సినిమాలు చేయడానికి వారంతా ఆసక్తి చూపుతుంటారు.
ఆ కారణంగానే ‘బ్రూస్ లీ’ పరాజయాన్ని మనసులోకి తీసుకోకుండా చెర్రీ మరోసారి ‘ధ్రువ’లో ఆమెతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ బ్యాడ్ లక్.. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ ఛాన్సిచ్చాడు.
ఇదిలావుంటే, రకుల్ తెలుగులో హీరోయిన్గా నటించి చూస్తుండగానే రెండేళ్ళు గడిచిపోయాయి. ఆ మధ్య ‘స్పైడర్’లో మహేశ్‌తో కలసి నటించిన రకుల్.. ‘ఎన్టీయార్ కథానాయకుడు’లో శ్రీదేవిగా గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. అయితే తెలుగు సినిమాలకు దూరమైనా ఆ లోటును తమిళ చిత్రాలతో కవర్ చేస్తోంది.
తాజాగా రకుల్ మళ్ళీ టాలీవుడ్‌పై దృష్టి పెట్టిందట. అందులో భాగంగానే సాయిధరమ్ తేజ్‌తో దర్శకుడు మారుతీ తెరకెక్కించబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే తొలుత ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా రష్మిక మండన్న పేరు వినిపించింది.
‘గీత గోవిందం’ లాంటి సూపర్ హిట్‌ను ఈ బ్యానర్ తనకు ఇచ్చినా.. డేట్స్ ఖాళీ లేని కారణంగా రష్మిక ఆ అవకాశాన్ని చేజార్చుకుందట. అది రకుల్‌కు కలసి వచ్చిందన్నది ఫిల్మ్‌నగర్ టాక్. మరి ఈ సినిమాతో అయినా ‘స్పైడర్’ పరాజయపు పీడకల నుండీ రకుల్ బయటపడుతుందేమో చూడాలి.