ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఫైర్ అయ్యారు. గత ఐదేళ్ల కాలంలో ప్రధాని మోడీ కేవలం లాలీపాప్‌లు ఇవ్వడం మినహా… దేశ అభివృద్ధి ఎక్కడ జరిగిందంటూ నిలదీశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ కుటుంబంపై ఎన్ని వేధింపులకు పాల్పడినా దేశ రాజకీయాల నుంచి తను వెనక్కి తగ్గే ప్రసక్తి లేనే లేదని తేల్చిచెప్పారు.
దేశ ప్రజలను పిచ్చివాళ్లుగా ప్రధాని మోడీ, అమిత్‌షాలే కాదు యావత్ బిజేపి భావిస్తోందని, అంతెందుకు గంగా నది ప్రక్షాళన పేరుతో వందల కోట్లు ఖర్చు చేసినా అది ఎంతవరకు సాగిందని నిలదీసారు.
‘గత ఐదేళ్లుగా దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలనీ నిర్వీర్యం చేసిన ప్రధానమంత్రి ప్రశ్నించేవారిపై దాడిచేస్తున్నారని ఎద్దేవా చేసారు. ప్రజలను తెలివితక్కువవాళ్లుగా భావించడం ప్రధానిమంత్రికే చెల్లింది. తన కుటుంబాన్నే కాదు ప్రజలను ఎంతగా వేధిస్తే అంత ఉధృతంగా మా పోరాటం ఉంటుందని’ చెప్పారు.