ఎక్కడకు వెళ్లినా ఆ పేరుతోనే పిలుస్తున్నారు: లావణ్య త్రిపాఠి

0
59

లావణ్య త్రిపాఠి. నాజూకు అందం చిన్నది. టాలీవుడ్‌కు అందాల రాక్షసి చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలతో విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆమె తాజా చిత్రంగా రూపొందిన ‘అర్జున్ సురవరం’. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘అందాల రాక్షసి’ నా మొదటి సినిమా కావడం నేను చేసుకున్న అదృష్టం. ఈ సినిమా నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఎక్కడికి వెళ్లినా ‘అందాల రాక్షసి’ అనే పిలుస్తూ వుంటే ఆనందంగా వుంది. ‘అర్జున్ సురవరం’ సినిమాలో నేను హీరోతో పాటు ఒక రిపోర్టర్‌గా కనిపిస్తాను. చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ రోల్ చేశాననిపించింది. ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పుకొచ్చింది.