ఒత్తిడిని తక్షణ విముక్తి కోసం…

0
41
depression
depression

రోజువారీ జీవితంలో ఒత్తిడి సహజం. అవసరం కూడా. ఇది మనం మరింత కష్టపడి పనిచేయటానికి, సరైన సమయంలో లక్ష్యాలను పూర్తి చేయటానికి ఎంతగానే ఉపయోగపడుతుంది. ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని అధికమించేందుకు కూడా దోహదపడుతుంది.

అయితే, తరచుగా, అదేపనిగా ఒత్తిడి వేధిస్తే.. తలనొప్పి, వెన్నునొప్పి, కడుపునొప్పి, నిద్ర పట్టకపోవటం వంటి సమస్యలకు దారితీస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనం కావటంతో పాటు ఏవైనా జబ్బులుంటే తీవ్రమవుతాయి కూడా. కాబట్టి ఒత్తిడి లక్షణాలను గుర్తిస్తే వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది.

ఇందుకు తేలికైన పద్ధతులూ ఉన్నాయి. వీటిల్లో గాఢంగా శ్వాస తీసుకోవటం ఒకటి. దీన్ని నిమిషం పాటు చేసినా ఒత్తిడి లక్షణాలు తగ్గుతాయి. దీర్ఘకాలం ఒత్తిడి బారినపడకుండానూ నివారించుకోవచ్చు.

ముందుగా ప్రశాంతంగా కూచొని గానీ, పడుకొని గానీ ఒక అరచేతిని ఛాతీ మీద.. మరొక అరచేతిని కడుపు మీద పెట్టుకోవాలి. ముక్కుతో నెమ్మదిగా గాఢంగా శ్వాస తీసుకోవాలి. ఈ సమయంలో కడుపు మీదుండే చేతిని కడుపు నెడుతుండాలి గానీ ఛాతీ మీది చేయి మాత్రం అలాగే ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా ముక్కుతో శ్వాసను వదిలేయాలి. ఇలా ఒక నిమిషం సేపు చేసినా మంచి ఫలితం కనబడుతుంది.

ఇలా చేయడం వల్ల ఒక లయ ప్రకారం గాఢంగా శ్వాస తీసుకోవటం వల్ల నాడీ వ్యవస్థ అతిగా స్పందించటం తగ్గుతుంది. వూపిరితిత్తులు సైతం మనం ప్రశాంతంగా ఉన్నామంటూ మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి. కడుపు, ఛాతీకి మధ్యన ఉండే విభాజక పటలం (డయాఫ్రం) సంకోచించటం, వ్యాకోచించటం వల్ల శరీర భంగిమ కూడా మెరుగుపడుతుంది. నొప్పి తగ్గుతుంది.