‘తలైవి’గా కంగనా రనౌత్

Kangana Ranaut to Play Jayalalithaa in a Biopic on the Late Tamil Nadu CM

0
41
kangana ranaut
kangana ranaut

బాలీవుడ్‌లో సంచ‌ల‌నాల‌కు చిరునామాగా మారిన నటి కంగ‌నా ర‌నౌత్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కనిపించనున్నారు. ది ఐరన్ లేడీ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో ఆమె పురట్చితలైవిగా నటించనున్నారు.

ఇటీవ‌ల స్వీయ దర్శకత్వంలో ‘మ‌ణిక‌ర్ణిక’ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఇందులో కంగ‌నా న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు జేజేలు ప‌లికారు. ప్ర‌స్తుతం జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో న‌టించేందుకు సిద్ధమైంది. “త‌లైవి” అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని విజ‌య్ తెర‌కెక్కించ‌నున్నాడు.

వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.