ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ సంస్థ పలువురి సెలబ్రిటీల మైనపు విగ్రహాలని తయారు చేసి ప్రజల సందర్శనార్ధం ఉంచుతుంది. దీనికి సంబంధించిన మ్యూజియం సింగపూర్‌లో ఉంది. ఇపుడు ఈ మ్యూజియంలో దక్షిణాది నుంచి ప్రభాస్ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు విగ్రహం ఉంది.
దక్షిణాది నుంచి ప్రభాస్ తర్వాత మహేష్ మాత్రమే ఆ ఘనత సాధించారు. అయితే మహేష్ అభిమానుల కోసం మార్చి 25 వ్యాక్స్ విగ్రహాన్ని హైదరాబాద్‌కి తీసుకురాబోతున్నారు. మహేష్ మల్టీ ప్లెక్స్ సంస్థ ఏఎంబీ సినిమాస్‌లో ఈ విగ్రహాన్ని ఒక్క రోజు ఉంచనున్నారు. తర్వాత సింగపూర్ తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు.
వ్యాక్స్ స్టాచ్యూ లాంచింగ్ ఈవెంట్‌ని ఘనంగా జరపాలని థియేటర్ యాజమాన్యం భావిస్తుందట. అయితే ఆ మధ్య మహేష్ మైనపు విగ్రహం ఎలా ఉంటుందో చిన్న నమూనాతో చూపించారు శిల్పి ఇవాన్ రీస్.
ఇందులో మహేష్ హెయిర్ స్టైల్ సరికొత్తగా ఉండగా, ఇది అభిమానులని ఆకట్టుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.