ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి…

0
83
Exercise
Exercise

చాలామంది ఇష్టమైనవిన్నీ తింటూనే బరువు పెరుగుతున్నామని బాధపడుతుంటారు. అలాంటి వారి బాధ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఫిట్‌గా ఉండాలనుకుంటే ముందు మన శరీరం ఎలా ఉందో, ఏం చేయాలో ఎవరికి వారే తెలుసుకోవాలి.

ఎక్సర్‌సైజ్, న్యూట్రిషన్ ప్లాన్ విషయంలో అలసత్వం మంచిది కాదు. ఒక వేళ ఏ రోజైన వర్కవుట్స్‌ను చేయకుండా ఉండటం, ఎక్కువ తినడమో జరిగితే కంగారు పడకుండా వాటిని ఎలా బ్యాలన్స్ చేయాలో ఆలోచించి వెంటనే ఆచరణలో పెట్టండి.

ఫిట్‌గా మారాలంటే మీ శరీరంలో వచ్చే మెరుగైన మార్పులను పట్టించుకోండి. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి. మీ కన్నా సన్నగా, ఫీట్‌గా ఉన్న వారితో స్నేహం చేయండి. అప్పుడు మీకు వారితో పోటిపడాలనే ఆలోచన వస్తుంది. ఇలాంటి చిన్నపాటి చిట్కాలు, సూచనలు పాటించడం వల్ల ఖచ్చితంగా స్లిమ్ అండ్ ఫిట్‌గా ఉండొచ్చు.