గ్రీన్‌లో చక్కెర – పాలు కలుపుకుని తాగొచ్చా?

0
87
green tea
green tea

ఇపుడు సాధారణ టీలను సేవించేవారి కంటే గ్రీన్ టీలను సేవించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికి కారణం గ్రీన్ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, పగటి పూటకంటే రాత్రి పూట నిద్రించ‌డానికి క‌నీసం గంట ముందు గ్రీన్ టీ తాగితే దాంతో కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎఫెక్టివ్‌గా దూరం చేసుకోవచ్చని ఆరోరగ్యం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

* రాత్రి నిద్ర‌కు ముందు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
* నిద్రించ‌డానికి ముందు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరం రిలాక్స్ అవుతుంది. మ‌న‌సంతా ప్ర‌శాంతంగా మారి చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది. అంతేకాదు, మ‌రుస‌టి రోజు లేచే స‌రికి ఉల్లాసం, ఉత్తేజం క‌లుగుతాయి.
* రోజంతా మ‌నం తిన్న ప‌లు ఆహార ప‌దార్థాల కార‌ణంగా శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. వాటిని శుభ్రం చేయాలంటే రాత్రి పూట నిద్ర‌కు ముందు గ్రీన్ టీని తాగాలి.
* రాత్రి పూట నిద్రించ‌డానికి గంట ముందు గ్రీన్ టీని తాగితే శ‌రీర మెటబాలిజం బాగా పెరుగుతుంది.
* రాత్రి పూట నిద్ర‌కు ముందు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్లు త‌మ ప‌ని ప్రారంభిస్తాయి.
* గ్రీన్ టీలో పాలు, చ‌క్కెర వంటివి క‌ల‌ప‌కుండా డైరెక్ట్‌గా తాగాలి. అలా తాగితేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.