తల్లి కాబోయే వారి కోసం

0
41

* తల్లి కాబోయే వాళ్లకు తగిన పోషకాలు ఉండే ఆహారం ఇవ్వాలని మన నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మన తీసుకునే ఆహారంలో ఎక్కువగా పిండి పదార్ధాలున్న పప్పులు, ధాన్యాలు, బియ్యం, రాగులు, జొన్నలు, గోధుమలు, అరటి, కర్రపెండులం, చిలగడదుంపలు, బ్రెడ్, పాలు, పండ్లు వీటితో పాటు మాంసకృత్తులు ఎక్కువగా వున్న ఆహారం తీసుకోవాలి.

* ముఖ్యంగా పచ్చటి ఆకుకూరలు, కేరట్, చిక్కుళ్లు, వేరుశెనగలు, సోయాబీన్సు్, పెరుగు, చేపలు, గుడ్లు, మాంసం. సోయాలో, వేరుశెనగల్లో మాంసకృత్తులు ఎక్కువగా వుంటాయి. రోజూ గుప్పెడు వేరుశెనగలు తింటే శరీరానికి సరిపడా మాంసకృత్తులు లభిస్తాయి.

* ముఖ్యంగా వెల్లుల్లిలోని అల్లిసిన్ వల్ల గుండె జబ్బులు రావు. రక్తంలోని కొవ్వుశాతం, కొలెస్టరాల్‌కు తగ్గించి, జీర్ణ వ్యవస్థలో ఆహారం విషపూరితం కాకుండా కాపాడే వెల్లుల్లి నిజంగా తల్లిలాంటిది.

* రాగులు, సజ్జలలో కాల్షియం, ఇనుము లభిస్తుంది. బెల్లం, చింతపండులో రక్తవృద్ధికి కావలసిన ఐరన్ లభిస్తుంది. క్యాబేజి స్థూలకాయాన్ని, ఊపిరితిత్తుల కేన్సర్ ప్రమాదాలను తొలగిస్తుంది.

* దోస మూత్రపిండాల వ్యాధులకు, కాలేయం, కీళ్లవాతం, బ్రోంకైటిస్ లకు కాకర సర్వరోగనివారణి. కంటికి చలువ మధుమేహులకు, శ్వాసవ్యాధులకు, ఆజీర్తి, కడుపు నొప్పులకు, ఉబ్బసం, లెప్రసిని కూడా తరిమివేస్తుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని పండంటి బిడ్డకు జన్మనివ్వండి.