* జలుబు అనేది సర్వసాధారణం. ఏ సీజన్‌లో అయిన రావచ్చు. అతి ఎండ, దుమ్ము, ధూళి, అతిచలి, శీతాకాలం ఇలాంటివి జలుబుకి కారణాలు. జలుబు ఒక అంటువ్యాధి.
* జలుబు చేస్తే, జ్వరం వచ్చినట్టుగా, తలనొప్పి, ముఖమంతా నొప్పిగా ఉంటుంది. అలాంటి సమయంలో అహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* తప్పని సరిగా విశ్రాంతి తీసుకోవాలి. జలుబు ఎక్కువగా ఉంటే ఉదయం, సాయంత్రం ముఖానికి ఆవిరి పట్టాలి.
* మరుగుతున్న నీటిలో కొద్దిగా పసుపు వేసి ఆవిరి పడితే మంచిది.
* తులసి దళం, చిటికెడు మిరియాలు కూడా వేసుకోవచ్చు. మరీ ఘాటుగా ఉండకుండా చూసుకోవాలి.
* బయట ఎక్కువగా తిరగవద్దు. ఆహారం తీసుకున్నా ప్రతిసారి ఉప్పు నీటితో నోటిని పుక్కిలించాలి.