గుండె పదిలంగా ఉండాలంటే గుమ్మడి గింజలు ఆరగించండి..

0
68

పూర్వకాలంలో కూరకోసం గుమ్మడికాయ కోస్తే అందులోని గింజల్ని ఎండబెట్టి వేయించుకుని తినేవాళ్లు. క్రమంగా ఆ అలవాటుపోయింది. కాయతో పోలిస్తే గింజల్లో వ్యాధులతో పోరాడే గుణం ఉంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి అధికంగా ఉంది.

వీటిని తినేవాళ్లలో మూత్రశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తక్కువ. గర్భిణీలకు ఇందులోని జింక్ వల్ల గర్భాశయ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఈ గింజలకి పొట్ట, రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, పేగు కేన్సర్లని అడ్డుకునే శక్తి ఉందట. అతిపెద్ద సమస్య అయిన నిద్రలేమిని నివారిస్తాయి.

వీటిల్లోని అధిక మెగ్నీషియం, పీచు కారణంగా మధుమేహం, బీపీ అదుపులో ఉంటాయి. ఒమేగా, మోనో అన్‌శాచ్యురేటెడ్ ప్యాటీ ఆమ్లాలతోబాటు, మాంగనీస్, ఫాస్ఫరస్‌ అధికంగా లభ్యమవుతాయి. సో, పచ్చిగానో లేదా వేయించుకునో సలాడ్లలోనో పెరుగులోనో గుప్పెడు గుమ్మడి గింజల్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఎముకులకీ ఎంతో బలం. గుండెకీ పదిలం.