రాజమండ్రి ఓటర్ల జాబితాలో కాజల్ అగర్వాల్ పేరు

0
65
kajal agarwal
kajal agarwal

సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగు రాష్ట్రాల్లో తయారు చేస్తున్న ఓటర్ల జాబితాలో సినీ నటి కాజల్ అగర్వాల్ పేరు ఉంది. సాధారణంగా ఓటర్ల జాబితాలో కొందరి పేర్లకు ముందు సినీ తారలు, ఎద్దులు, మేకల ఫోటోలు ప్రత్యక్షకావడం సర్వసాధారణమైన విషయం. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌న మ‌రొక‌టి జ‌రిగింది. ఇది ఎన్నిక‌ల అధికారుల నిర్ల‌క్ష్యానికి అద్దం ప‌ట్టేలా ఉంది.

ఈ వివరాలను పరిశీలిస్తే, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో దీపికా ప‌దుకొణే పేరుతో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫోటో ప్ర‌త్య‌క్షం అయింది. దీపికా ప‌దుకొణే తండ్రి పేరు ర‌మేష్ కొండా అని ఆమె వ‌య‌స్సు 22 అని ముద్రించారు. ఇంటి పేరు కూడా ఆ జాబితాలో ఉంది. దీంతో ఎన్నిక‌ల అధికార్లు ఎంత సక్ర‌మంగా ప‌నులు చేస్తున్నారో అర్ధ‌మ‌వుతుంది అని ఓట‌ర్లు మండిప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం దీపికా పేరుతో ఉన్న కాజ‌ల్ ఫోటోకి సంబంధించిన ప‌త్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీనిపై నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ ఫొటోతో పద్మావతి అనే మహిళకు ఓటు హక్కు ఇచ్చిన విష‌యం విదిత‌మే.