ఆధునిక యుగపు మహమ్మారిగా షుగర్ వ్యాధిని పేర్కొనవచ్చు. ఈ వ్యాధి పిల్లలకు, పెద్దలకు తేడా లేకుండా వస్తుంది. ఇందుకు గల కారణం మన జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పులే.
* అధిక బరువు, స్థూలకాయం, పొట్టలో చేరిన కొవ్వులే దీనికి ప్రధాన కారణం. కొందరిలో ఇన్సులిన్ బాగానే ఉత్పత్తి అయినా, దాన్ని వినియోగించుకునే సామర్ధ్యం తగ్గిపోతుంది. ఇది కూడా మధుమేహానికి మూలమవుతుంది.
* బరువుతగ్గడం, క్రమం తప్పని వ్యాయమాలతో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచవచ్చు. అయిన కానీ చాలా మంది ఈ విషయంలో అశ్రద్ధగానే ఉంటున్నారు.
* రోజుకు అరగంట పాటు వాకింగ్, స్విమింగ్, సైక్లింగ్, వంటి వ్యాయామాలు చేయాలి. తక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్ధాలు తీసుకుంటూ, బరువు తగ్గించుకోవాలి. క్రమం తప్పక వైద్య చికిత్సలు తీసుకోవడంతో పాటు కొలెస్ట్రాల్ నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* పొగతాగడం వంటివి పూర్తిగా మానేయాలి. నిరంతరం షుగర్ నియంత్రణ విషయంలో శ్రద్ధ వహిస్తే, మధుమేహం ఉన్నా, వాటి దుష్పరిణామాలకు గురికాకుండా జీవితాంతం హాయిగా జీవించవచ్చు.