ఇటు టాలీవుడ్‌లోనే కాకుండా అటు కోలీవుడ్‌లో కూడా బయోపిక్‌ల కాలం నడుస్తోంది. ఇందులోభాగంగా, ప్రస్తుతం కోలీవుడ్‌లో జయలలిత జీవిత నేపథ్యంలో బయోపిక్‌లు తెరకెక్కనున్నాయి. ఆ మధ్య తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత బయోపిక్ రూపొందిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో నిత్యామీనన్ లీడ్ రోల్ పోషిస్తుంది.
ఇకపోతే, తాజాగా, తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తాను ‘తలైవీ’ అనే టైటిల్‌తో జయలలిత బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించాడు. వైబ్రీ మీడియా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు.
ఇందులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను జయలలిత రోల్ కోసం సంప్రదించారు. ఈ ప్రాజెక్టులో నటించేందుకు ఆమె ఏకంగా 24 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట. కంగనాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఆమెకి అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారని టాక్. తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.