ఇపుడు చక్కెర వ్యాధి సర్వసాధారణంగా మారింది. అనేక మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. పైగా, అన్నం తినడం పూర్తిగా మానేశాం. అయిన కూడా షుగర్ లెవల్స్ తగ్గడం లేదు, బరువు తగ్గడం లేదు అని బాధపడుతుంటారు. ఇలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయాలను పరిశీలిస్తే,
* అన్నంలో గ్లిసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. గ్లిసెమిక్ ఇండెక్స్ అంటే తిన్న ఆహారం వల్ల బ్లడ్ షుగర్‌లో వచ్చే మార్పు. అన్నానికి ఈ మార్పు ఎక్కువగా ఉంటుంది. అన్నంలో కూరగాయలు, పప్పు, పెరుగు మెుదలైనవి కూడా ఉంటాయి. అప్పుడు భోజనంలో గ్లిసెమిక్ ఇండెక్స్ తగ్గతుంది. కాబట్టి అన్నం నిరభ్యంతరంగా తినొచ్చు. ఎప్పుడు కూడా ఏ ఆహారం అయిన అవసరానికి మించి తీసుకోరాదు.
* రైస్‌లో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ ఫీ కాబట్టి అల్సర్, క్రానిక్ డిసీజ్ ఉన్న వారికి రైస్ మంచిది. రైస్ జీర్ణకోశాన్ని ఇబ్బంది పెట్టదు. ఇందులో ఉండే ధియామైన్ ( బి విటమిన్ ) మెటబాలిజానికి లాభం చేస్తుంది. ఆలోచనాశక్తిని పెంచుతుంది.
* రైస్‌లో ఉండే అమినో యాసిడ్ కంపోజిషన్ తర్వగా కండపడుతుంది. అంతేకాదు మిథియోనైన్ అనే అమినో ఆమ్లం కాలేయంలో ఉన్న ఫ్యాట్‌ను సరఫరా చేస్తుంది. కాలేయ వ్యాధులున్నవారు రైస్‌ను తప్పక తీసుకోవచ్చు. ఏ రైస్ అయినా సరే మితంగా తీసుకోవాలి. అమితంగా తీసుకుంటే రైసే కాదు ఏ ఆహారం కూడా మంచిది కాదు.