బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ మరోబిడ్డకు జన్మనివ్వనుందా? అవుననే చెబుతోంది ఆమె తాజా ఫోటో. నిజానికి ఐశ్వర్యారాయ్, ఆమె భర్త అభిషేక్ బచ్చన్‌లు తమ కుటుంబ వ్యవహారాలను ఎంతో సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తుంటారు. పార్టీస్‌లో, ఇతరత్రా కార్యక్రమాలలో పెద్దగా పాల్గొనరు.
అయితే ఇటీవల ముంబైలో జరిగిన హోలీ వేడుకలలో బాలీవుడ్ తారాగణం అంతా పాల్గొని సందడి చేశారు. కానీ ఐష్ ఆమె భర్త అభిషేక్ బచ్చన్ హాలిడేస్‌ని ఎంజాయ్ చేయడానికి గోవా వెళ్ళారు. అక్కడ బీచ్ పరిసర ప్రాంతాలలో ఎంజాయ్ చేసిన వారు నడుచుకుంటూ వస్తుండగా, గోవాకి చెందిన ఫోటోగ్రాఫర్ ఈ జంటని తమ కెమెరాలో బంధించారు.
వెంటనే ఆ ఫోటోతో గోవా లోకల్ న్యూస్ పేపర్ కథనం ప్రచురించింది. అయితే ఆ ఫోటోలో ఐష్ బేబి బంప్‌తో కనిపిస్తుందని, త్వరలోనే పండంటి బిడ్డకి జన్మనివ్వనుందంటూ ప్రచారాలు మొదలు పెట్టారు. మరి దీనిపై ఐష్ కాని, అభిషేక్ కాని ఎలా స్పందిస్తారో వేసిచూడాల్సిందే.