ఉదయం నిద్ర లేవగానే టిఫిన్ తిన్న తరువాత చిక్కని కప్పు కాఫీ తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల జిహ్వను తృప్తి పరచామనుకుంటారు. కానీ కాఫీలో చక్కెర బదులు స్పూను బటర్ కలుపుకుని తాగితే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ అని వారు చెబుతున్నారు.
బటర్ అనేది ఆరోగ్య రీత్యా అంత మంచిది కాకపోయినా కాఫీలో దీన్ని కలిపి తాగడం వల్ల కొన్ని గంటల వరకూ ఆకలి అనేది వేయదనీ, దాని కారణంగా ఆహారం ద్వారా అధిక క్యాలరీలు కరిగిపోతాయని తాజా పరిశోధనలో తేలింది. ఇలా చేయడం ద్వారా బరువు తగ్గడంతో పాటు క్రీమీ కాఫీని తాగడం వల్ల మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.