మహిళలపై అకృత్యాలు, మోసాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఇంటీరియర్ డిజైనర్ సింధూరితో ప్రేమాయణం కొనసాగించిన ఓ ప్రజాపతినిధి కుమారుడు పెళ్లి అనేసరికి ముఖం చాటేశాడు. ఇంకా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నేరానికి తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామ భూపాల్ రెడ్డి కుమారుడు సామ తేజ్ పాల్ రెడ్డి (27) కారణం. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌కు చెందిన ఇంటీరియర్ డిజైనర్ సాయి సింధూరి (27)ని సామ తేజ్ పాల్ రెడ్డి ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామని మాయమాటలు చెప్పాడు.
పెళ్లి మాటెత్తేసరికి దాటవేసేవాడు. ఈ విషయమై గత డిసెంబర్ లోనే సింధూరి శంకర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును పోలీసులు విచారిస్తుండగానే, ఇటీవల తేజ్ పాల్ రెడ్డి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. తేజ్ పాల్ పై ఐపీసీ సెక్షన్ 376, 417, 420 కింద కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు.