తమిళంలో వారిద్దరిపై మనసుపడ్డా : కాజల్ అగర్వాల్

0
54

ఇటు కోలీవుడ్, అటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో అగ్రకథానాయకిగా ఉన్న నటి కాజల్ అగర్వాల్. తన అగ్రస్థానాన్ని సుదీర్ఘకాలంగా నిలబెట్టుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. తమిళంలో కమల్ సరసన ‘భారతీయుడు 2’ సినిమాలో నటిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన సినీ కెరీర్ గురించి స్పందించారు. తమిళ స్టార్ హీరోలైన అజిత్.. విజయ్‌లను గురించి ప్రస్తావించింది. అజిత్‌తో ‘వివేకం’ సినిమాలో నటించాను. ఆ సినిమా చేయడానికి ముందే ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్నాను.

ఆ సినిమా షూటింగు సమయంలో ఆయన అంకితభావాన్ని చూశాను. ఆయన ఆ స్థాయికి ఎలా చేరుకున్నారనేది అర్థమైపోయింది. ఆయనలోని మానవత్వం నన్ను కదిలించి వేసింది. ఇక విజయ్‌తో కలిసి ‘తుపాకి’, ‘జిల్లా’, ‘మెర్సల్’ సినిమాలు చేశాను.

సెట్స్‌లోకి అడుగుపెట్టిన తరువాత ఆయన ఆ సినిమాను గురించి తప్ప మరో విషయాన్ని గురించిన ఆలోచన చేయరు. ఆయన నటనలో సహజత్వం నాకు నచ్చుతుంది. ఇంతటి స్టార్ హీరోలైన ఈ ఇద్దరిలోను గర్వమనేది మచ్చుకు కూడా నాకు కనిపించలేదు” అని చెప్పుకొచ్చింది.