2014లో టీడీపీని నెత్తినపెట్టుకుని మోసి ఓట్లు వేయించిన పవన్ ఈసారి కూడా ప్రజలను మోసం చేసి చంద్రబాబును మళ్లీ సీఏం చేసేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ శ్రమపడుతున్నాడని పృథ్వీ ఆరోపించారు. ఏప్రిల్ 11తో టీడీపీ, జనసేన పార్టీలను ప్రజలు భూస్థాపితం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులను హెచ్చరించడంపై సినీ నటుడు, వైసీపీ నేత పృథ్వీ ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో ఏ నాయకుడైనా ప్రజల పక్షం వహించి ప్రభుత్వాన్ని విమర్శిస్తారని, కానీ పవన్ మాత్రం విపక్ష నేతను టార్గెట్ చేసుకుని తన ఉద్దేశాన్ని చాటుకుంటున్నాడని విమర్శించారు. ఇలాంటి అసమర్థ నేత రాజకీయాల్లో ఎక్కడా ఉండడని ఎద్దేవా చేశారు.
అయినా, తొక్కలు, తోళ్లు తీయడానికి మనదేమైనా కొబ్బరికాయల బిజినెస్సా అంటూ సెటైర్లు వేశారు పృథ్వీ. ఒకవేళ పవన్ తాట తీయాలనుకుంటే రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్న చంద్రబాబు, లోకేష్ ల తాట తీయాలని సూచించారు.