సైలెన్స్ అంటున్న స్వీటీ.. ఎందుకని?

0
34
anuskha

anuskha

భాగమతి తరువాత ఏ చిత్రంలోనూ నటించని ఆ స్వీటీ పెరిగిన తన బరువును తగ్గించుకోవడానికి ఎంతో శ్రమించింది. అయితే ఇటీవల విదేశాలకు వెళ్లి మరి అనుష్క బరువు తగ్గి నాజూగ్గా తయారైంది. తాజాగా సైలెన్స్‌ అనే త్రిభాషా చితంలో నటించడానికి సిద్ధమైంది. మాధవన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు రానా అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జరుగుతోంది.

హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కిస్తున్న ఇందులో నటి అనుష్క మూగ, చెవుడు కలిగిన యువతిగా నటించబోతోందట. ఇందుకుగానూ ఈ అమ్మడు మూగ భాషలో శిక్షణ పొందుతోంది. అమెరికాలో మూగ భాషలో తర్ఫీదు తీసుకుంటుందని సమాచారం.అసలు మాటలే లేకుండా తన సైగలతో, ముఖ కవళికలతో సైలెన్స్‌ చిత్రం ద్వారా అలరించడానికి దేవసేన సిద్ధమవుతుందన్నమాట.