య‌డ్యూర‌ప్ప‌కి ధ‌న్య‌వాదాలు తెలిపిన‌ సుమ‌ల‌త

0
49

మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలత అంబరీశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు యడ్యూరప్పను కలిశారు. మండ్యలో బీజేపీ అభ్యర్థిని పోటీలో నిలపరాదని సుమలతకు మద్దతు ఇవ్వాలని తీర్మానించడంతో ఆమె పార్టీ అధ్యక్షులు యడ్యూరప్ప నివాసానికి చేరుకుని ధన్యవాదాలు తెలిపారు. ప్రచారాలలో పాల్గొని మద్దతు ఇవ్వాలని యడ్యూరప్పను కోరారు. మండ్య నియోజకవర్గంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంపూర్ణంగా మద్దతు ఇస్తారని తాను ప్రచారాలకు వస్తానని యడ్యూరప్ప హామీ ఇచ్చారు.

ఎన్నికలకు ముందే బీజేపీ ఇక్కడ పోటీ చేయరాదని, సుమలతకు మద్దతు ఇవ్వాలని నిర్ణయానికి వారు కట్టుబడ్డారు. అనంతరం సుమలత మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సంపూర్ణంగా తమకు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. మండ్య ప్రజలు తమకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని వారి ఆశీర్వాదంతోనే పోటీకి దిగానని సుమలత తెలిపారు.