ప్రియురాలు వేధింపులకు గురిచేస్తుందంటూ.. పోలీసుల ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. హైదరాబాద్ యువకుడు. తానెంతో ప్రేమించిన యువతే తనను ఫోన్ కాల్స్‌తో వేధింపులకు గురిచేస్తుందని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
ఈ ఘటన లంగర్ హౌస్ పరిధిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. డీఎల్ఎఫ్‌లో పని చేస్తున్న ఆదిల్ (25) అనే యువకుడు, క్లాస్ మేట్ అయిన యువతి (22)ని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇంతకాలం రహస్యంగా ఉన్న ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో, ఆమె మాట మార్చింది.
ఆదిల్‌కు ఫోన్ చేసి దూషించింది. పదే పదే ఆమె ఫోన్ చేసి దూషిస్తుండటంతో మనస్తాపం చెందిన ఆదిల్, లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌లో ప్రేయసిపై ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.