కాబోయే భర్త ముఖాన్ని దాచేసిన రేణూ దేశాయ్.. ఆద్యాకు డ్యాన్స్ నేర్పిస్తూ..?

0
37

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన కథాంశంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్ సినిమా తీస్తోంది. ఈ సినిమా కోసం కథను సిద్దం చేస్తున్న రేణూ దేశాయ్ ప్రస్తుతం కథకు సంబంధించి రీసెర్చ్ చేస్తుంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో పర్యటించింది. అదే సమయంలో పవన్ కూడా కర్నూలులో పర్యటించారు.

పవన్‌కు వ్యతిరేకంగానే రేణూ కర్నూలు ట్రిప్పేసిందని వదంతులు వచ్చాయి. ఇందుకు రేణూ పవన్ కోసం తాను రాలేదని.. రైతుల కోసం వచ్చానని ధీటుగా సమాధానమిచ్చింది. ఈ సంగతిని కాస్త పక్కనబెడితే.. తాజాగా రేణుదేశాయ్ తన పిల్లలు అకీరా, ఆధ్యాలతో పాటు తనకు కాబోయే భర్తతో కలసి సమ్మర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇండొనేషియాలోని బాలిలో సందడి చేస్తున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో రేణు దేశాయ్ పంచుకున్నారు. ఆధ్యాతో కలసి తన కాబోయే భర్త డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా అప్ లోడ్ చేశారు. అయితే, ఇప్పుడు కూడా తన కాబోయే భర్త ముఖాన్ని ఆమె నేరుగా చూపించలేదు. భర్త ముఖాన్ని అక్షరాలతో దాచేసిన రేణూ.. వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.