మజిలీ కోసం ”మాయ్యా… మాయ్యా” అంటోన్న చైతూ

0
56

నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం మజిలీ. నిన్నుకోరి ఫేమ్ శివనిర్వాణ పెళ్లి తర్వాత సమంత, నాగచైతన్య కాంబినేషన్‌లో తొలిసారిగా తీసిన సినిమా ఇదే. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా నుంచి తాజాగా ”మాయ్యా… మాయ్యా” అని సాగే వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ఈ పాటలో చైతూ పాత్ర స్వరూప స్వభావాలను చక్కగా చూపెట్టారు.

చైతూ తన స్నేహితులతో కలిసి ఆడిపాడే దృశ్యాలతో ఈ పాట ఆకట్టుకునేలా వుంది. దివ్యాన్ష కౌశిక్ మరో కథానాయికగా నటించిన ఈ సినిమాలో చైతూ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.