దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరైన నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసి తమిళ సీనియర్ నటుడు రాధా రవి ఇక్కట్లు కొని తెచ్చుకున్నారు. ఇంకా క్షమాపణలు చెప్పినా వివాదం సద్దుమణగలేదు. తాజాగా నటి సమంత సైతం ఆయన్ను టార్గెట్ చేసింది.
ట్విట్టర్లో సమంత స్పందిస్తూ.. “రాధా రవీ… మీ కష్టం ఎప్పటికీ అలాగే నిలిచివుంటుంది. మీరిప్పుడు బాధలో ఉన్నారు. దాన్ని చూసి మేమూ బాధపడుతున్నాం. మీ ఆత్మ లేదా ఏం మిగిలుంటే దానికి శాంతి, ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నా.
నయనతార తరువాతి సూపర్ హిట్ సినిమాకు మీకు టికెట్లు పంపిస్తా. పాప్ కార్న్ తింటూ ఆనందించండి” అని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. రాధారవి నటించే సినిమాల్లో ఇక నటించేది లేదని గట్టి నిర్ణయాన్ని కూడా సమంత తీసుకుంది.
మరోవైపు నయనతార రాధారవి కామెంట్స్‌ను ధీటుగా స్పందించింది. తనకు తమిళ ప్రేక్షకుల రూపంలో గొప్ప జీవితాన్ని అందుకునేలా దేవుడు చేశాడని చెప్పింది.
మంచి అవకాశాలు వచ్చేలా దీవించాడు. ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా తాను సీతగా, దెయ్యంగా, దేవతగా, స్నేహితురాలిగా, భార్యగా, ప్రేయసిగా నటిస్తూనే ఉంటాను. తన అభిమానుల వినోదానికి లోటు లేకుండా చూసుకుంటానని క్లారిటీ ఇచ్చింది.