కజక్‌స్థాన్ రాజధాని ఆస్థానా పేరు మార్పు

0
66

కజక్‌స్థాన్ రాజధాని ఆస్థానా పేరును నుర్‌సుల్తాన్‌గా మార్చనున్నారు. ఈ మేరకు దేశ మాజీ అధ్యక్షుడు నుర్‌సుల్తాన్ నజర్‌బయెవ్ గౌరవార్థం రాజధాని ఆస్థానా పేరును నుర్‌సుల్తాన్‌గా మార్చేందుకు పార్లమెంటు మార్చి 20న ఆమోదం తెలిపింది. కజక్‌స్థాన్ అధ్యక్షుడిగా ఉన్న నుర్‌సుల్తాన్ నజర్‌బయెవ్ అనూహ్యంగా మార్చి 19న తన పదవికా రాజీనామ చేశారు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడైన కస్యం జొమ్రాట్ టొకయెవ్ తన తొలి అధికారిక చర్యగా రాజధాని పేరును మార్చాలని ప్రతిపాదించారు.