పొరుగుదేశాల ప్రాంతాలు మావే.. చైనా మ్యాప్‌లను ధ్వంసం చేసేసింది..

0
44

భారత్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్, టిబెట్, తైవాన్ తదితర ప్రాంతాలు తనకు చెందినవన్నది చైనా భావిస్తోంది. పొరుగుదేశాల ప్రాంతాలను చైనా తనవిగా చెప్పుకుంటూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత భూభాగంగా, టిబెట్, తైవాన్‌లను స్వతంత్ర దేశాలుగా చూపించారంటూ ఓ సంస్థ తయారుచేసిన సుమారు 30 వేల మ్యాప్‌లను చైనా అధికారులు ధ్వంసం చేశారు.

అన్హుయి ప్రావిన్స్‌లోని క్వింగ్డో పట్టణంలో ఈ ఘటన జరిగింది. చైనాకు తరచుగా పొరుగుదేశాలతో సరిహద్దు వివాదాలు వస్తుండడంతో, అక్కడ రూపొందించే మ్యాప్ లపై ప్రభుత్వ పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది.

అయితే విదేశీ కంపెనీ కోసం తాము సదరు మ్యాప్‌లను తయారుచేశామని సంస్థ వాపోతోంది. తప్పుడు మ్యాప్‌లు ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ అయితే.. ఉగ్రవాదులతో ముప్పు పొంచి వుందని.. అందుకే ఆ మ్యాప్‌లను ధ్వంసం చేసినట్లు చైనా సమర్థించుకుంటోంది.