#SuryakantamTrailer వచ్చేసింది.. నిహారికకు హిట్ ఖాయమేనా?

0
32
Niharika
Niharika

మెగా డాటర్ నిహారిక ఖాతాలో ఇప్పటివరకు ఓ హిట్ కూడా లేదు. తాజాగా సూర్యకాంతం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది నిహారిక. నిహారిక జోడీగా రాహుల్ విజయ్ చేసిన ఈ సినిమాకి ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ నెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

సూర్యకాంతం .. పూజా అనే ఇద్దరు అమ్మాయిల ప్రేమ మధ్య నలిగిపోయే అభి అనే కుర్రాడి కథే ఈ సినిమా అనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమైపోతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ ట్రైలర్ యూత్‌ను ఆకట్టుకునేలా వుంది.

ఈ చిత్రంలో నిహారిక పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని సినీ పండితులు అప్పుడే ట్రైలర్ చూసి జోస్యం చెప్పేస్తున్నారు. మరి ఈ సినిమా ద్వారానైనా నిహారిక ఖాతాలో హిట్ పడుతుందో లేదో చూడాలి.