దక్షిణాది స్టార్ హీరోయిన్, ప్రేమమ్ సాయిపల్లవి ఒక దర్శకుడితో ప్రేమలో పడిందనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు .. అమలా పాల్ మాజీ భర్త ఏ. ఎల్. విజయ్. అమలాపాల్‌కు దూరమైన విజయ్ ప్రస్తుతం సాయిపల్లవికి దగ్గరయ్యాడని కోలీవుడ్ కోడైకూస్తోంది.
ఇప్పటికే విజయ్, సాయిపల్లవి కాంబినేషన్లో ‘కణం’ సినిమా తెరకెక్కింది. తమిళ .. తెలుగు భాషల్లో ఒక వైవిధ్యభరితమైన చిత్రంగా ఇది మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా షూటింగు సమయంలో నుంచే ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందనీ .. ఇప్పుడు బలపడిందని చెప్పుకుంటున్నారు.
పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. కానీ సాయిపల్లవి అభిమానులు మాత్రం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టి పారేస్తున్నారు. ఇప్పటికే తమ హీరోయిన్ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పిన ఇంటర్వ్యూను గుర్తు చేస్తున్నారు.
అయితే నెటిజన్లు మాత్రం ఆమె పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తలపై సాయిపల్లవి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.