‘సూపర్ డీలక్స్’కు ”ఎ” వచ్చింది.. సమంత, రమ్యకృష్ణ కుమ్మేస్తారా?

0
36
Ramya Krishna
Ramya Krishna

పెళ్లికి ముందు.. పెళ్లికి తర్వాత తనదైన శైలిలో సినిమాలలో నటిస్తూ జెట్ వేగంలో దూసుకుపోతున్న హీరోయిన్ సమంత. తాజాగా సమంత, రమ్యకృష్ణ నటించిన సూపర్ డీలక్స్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజున్న సమంత నటించిన ‘సూపర్ డీలక్స్’ సినిమాకు సెన్సార్ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది.

ఇందులో ట్రాన్స్ జెండర్‌గా విజయ్ సేతుపతి .. పోర్న్‌స్టార్‌గా రమ్యకృష్ణ కనిపించనుండటం విశేషం. ఫహాద్ ఫాజిల్ కూడా ఒక కీలకమైన పాత్రను పోషించాడు.

తాజాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇక త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను కురిపిస్తుందో..?