హే ఊర్మిళ… నీ కొత్త ప్రయాణం తెలుసుకుని థ్రిల్ అయ్యా.. ఆర్జీవీ

0
61
urmila rahul
urmila rahul

బాలీవుడ్ నటి, రంగీలా హీరోయిన్ ఊర్మిళ రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈమె ఉత్తర ముంబై లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీలో ఊర్మిళ చేరడంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ‘హే ఊర్మిళ.. నీ కొత్త ప్రయాణం గురించి తెలుసుకుని ఎంతో థ్రిల్‌ అయ్యా. ఎంతో అందమైన మహిళవైన నువ్వు అందమైన రాజకీయ నాయకురాలివి కాబోతున్నావు’ అంటూ వర్మ ట్వీట్ చేశారు.

అంతేకాకుండా రంగీలా సినిమాలోని ‘ఆయిరే ఆయిరే…’ పాట లిరిక్స్‌‌ను ట్వీట్‌కు జత చేశారు. వర్మ డైరక్షన్‌లో ఊర్మిళ, ఆమీర్‌ ఖాన్‌ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘రంగీలా’ మూవీ 1995లో విడుదలై సూపర్ హిట్‌ అందుకుంది.

ఊర్మిళ అంటే వర్మకు ప్రత్యేకమైన అభిమానం ఉన్న విషయం తెలిసిందే. మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ‘రంగీలా’ సినిమాలో ఊర్మిళ స్టిల్‌‌ను షేర్‌ చేసి అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.