మోహన్ బాబు జీవితంలో ఏ మహిళకూ ‘పసుపు కుంకుమ’ ఇవ్వలేదు

0
58
mohanbabu
mohanbabu

 

mohanbabu
mohanbabu

ప్రముఖ సినీ నటుడు మోహన్‌ బాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంగళవారం వైఎస్‌ జగన్‌, మోహన్‌ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు వ్యవహార శైలిపై మోహన్‌ బాబు ముందు నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఆయన తిరుపతిలో ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మనుషులు తనను రెచ్చగొడితే ఆయన అసలు బండారాన్ని బయట పెడతానని​కూడా మోహన్‌బాబు హెచ్చరించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలపై చర్చకు తాను సిద్ధమేనని ఇదివరకే మోహన్‌ బాబు ప్రకటించారు.
ఈ నేపథ్యం కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై దివంగత దాసరి నారాయణ రావు పెద్ద కోడలు సుశీల సంచలన వ్యాఖ్యు చేశారు. నటుడు మోహన్ బాబు ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారో చెప్పాలని సుశీల ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, ‘పసుపు కుంకుమ’ పథకంపై ఆయన చేసిన విమర్శలను తప్పుబట్టారు.

మోహన్ బాబుది దురుసు ప్రవర్తనని ఆరోపించిన ఆమె, ఈ విషయం సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. ఆయన తన జీవితంలో ఏ మహిళకైనా ‘పసుపు కుంకుమ’ ఇవ్వలేదని ఆరోపించారు. లక్షల మందికి చంద్రబాబునాయుడు అండగా నిలిచి, ఈ పథకాన్ని అందించారని, అందులో తప్పేముందో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించిన సుశీల, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మోహన్ బాబుకు తెలియదా? అని ప్రశ్నించారు.