ఇన్విజిలేటర్.. ఓ పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సూర్యాపేటలో కలకలం రేపింది. సదరు విద్యార్థినికి కాపీలు కొట్టేందుకు సహకరించిన అతడు.. ఆపై అమ్మాయిని ఊరి బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట అరవై అడుగుల రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఓ బాలిక టెన్త్ పరీక్షలు రాస్తోంది. మండల పరిధిలోని ఓ తండాలో టీచర్ గా పని చేస్తున్న 50 ఏళ్లకు పైబడిన వ్యక్తి, ఈ పాఠశాలకు ఇన్విజిలేటర్ గా వచ్చాడు.
ఆ బాలిక చూసి రాసేందుకు సహకరించిన టీచర్, పరీక్ష తరువాత బయట వెయిట్ చేయాలని చెప్పి, ఆమెను తన టూ వీలర్‌పై ఎక్కించుకుని, పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.