సుత్తితో బాది తండ్రిని హత్య చేసిన తనయుడు

0
49

కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. పెంచి పెద్ద చేసిన తండ్రిని పువ్వుల్లో పెట్టి చూసుకోవల్సిన తనయుడు కర్కోటకుడిగా మారిపోయాడు. మద్యం మత్తులో తండ్రిని సుత్తితో బాది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన తాలూకాలోని కర్ణాటక రాష్ట్రంలోని బంటహళ్లి గ్రామంలో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన రామచంద్రప్ప (70) నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు. 3వ కుమారుడు మంజునాథ్‌ బెంగుళూరులోని మారతహళ్లిలలో షేవింగ్‌ షాప్‌ నిర్వహిస్తున్నాడు.

నాలుగు నెలల క్రితం గ్రామానికి తిరిగి వచ్చిన మంజునాథ్‌ తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి తండ్రితో గొడవపడేవాడు. బుధవారం రాత్రి కూడా తాగి ఇంటికి వచ్చి తండ్రిపై దాడి చేశాడు.

అనంతరం వైర్‌తో గొంతును చుట్టి రొకలి, సుత్తితో తలపై కొట్టి హత్య చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. హత్యా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. విస్తృతంగా గాలింపు చేపట్టి 5 గంటలలోగానే నిందితుడు మంజునాథ్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.