తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా, ఆయన పలు హామీలు గుప్పిస్తున్నారు. రాయలసీమకు ప్రత్యేక వ్యవసాయ మండళ్లను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కడపను దత్తత తీసుకుంటానన్నారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే కడపలో ఉర్దూ యూనివర్సటీ ఏర్పాటు చేస్తానమన్నారు. జిల్లాలో ఉద్యాన పంటలను ప్రోత్సాహిస్తానని, రాయలసీమకు ప్రత్యేక వ్యవసాయ మండళ్లను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. లక్ష మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.
కడపను దత్తత తీసుకుని.. రాయలకాలం నాటి పాలన తీసుకువస్తానన్నారు. ‘జగన్… భాజాపా, తెరాసకు భాగస్వామిగా మారిపోయారన్నారు. జగన్‌లా డొంకతిరుగుడు రాజకీయాలు తాను చేయనని, తనను విమర్శించే హక్కు జగన్‌కు లేదని మండిపడ్డారు.