శ్రీరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని ఓ జాతీయ పార్టీ ఆఫర్ ఇచ్చిందట.. ఆ పార్టీ పేరేంటో?

0
31

వివాదాస్పద నటి శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో తనకు ఓ జాతీయ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చిందని శ్రీరెడ్డి తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ఓ జాతీయ పార్టీ ఏపీలో తనకు ఎంపీ సీటు ఇస్తామని చెప్పిందని శ్రీరెడ్డి వెల్లడించింది.

జాతీయ పార్టీ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించాలా అంగీకరించాలా అనేది కన్‌ఫ్యూజన్‌లో వున్నానని శ్రీరెడ్డి చెప్పింది. రెండు రోజుల్లో చెన్నై వెళ్దామనుకుంటున్నానని… అందుకే ఫైనాన్షియర్‌ను సాయంత్రం ఆరు గంటలకు రమ్మంటే.. సదరు ఫైనాన్షియర్ అర్థరాత్రి వచ్చి గొడవ చేశారని శ్రీరెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా ఆమె పోలీసులకు ఇచ్చారు.

కాంగ్రెస్, బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం మాత్రమే ఏపీలో కొద్దో గొప్పో ఉనికిలో ఉన్నాయి. వీటిలో శ్రీరెడ్డికి ఆఫర్ ఇచ్చే పార్టీ బీజేపీ అని టాక్ వస్తోంది. అయినా బీజేపీ పార్టీ శ్రీరెడ్డికి ఆఫర్ ఇచ్చే ఆలోచనలో లేదని ఆ పార్టీ శ్రేణులు అంటున్నా.. శ్రీరెడ్డి నొక్కి చెప్తుండటం వెనుక అసలు రహస్యం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలాంటి వివాదానికి తావిస్తుందోనని చర్చించుకుంటున్నారు.