విద్యార్థులకు వి చాట్‌తో వింత అసైన్‌మెంట్..

0
27

ఓ ప్రొఫెసర్ విద్యార్థులకు ఇచ్చిన అసైన్‌మెంట్ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాతో విద్యార్థుల చదువులు నాశనమవుతున్న నేపథ్యంలో.. చైనాలోని హనెన్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ లాలో ఆన్‌లైన్ అండ్ న్యూ మీడియా కోర్సును నిర్వహిస్తున్నారు.

ఇది విద్యార్థులకే వర్సిటీ ప్రొఫెసర్ వింత అసైన్‌మెంట్ ఇచ్చారు. ప్రతి విద్యార్థి సోషల్ మీడియా యాప్ ”వీ చాట్‌”లో ఎంత ఎక్కువ మందిని మిత్రులుగా చేసుకుంటే.. అన్ని మార్కులు వేస్తానని తెలిపారు. మిత్రుల పరిధిని బట్టి మార్కులను కూడా నిర్ణయించారు.

1667 మందిని మిత్రులుగా చేసుకుంటే ఏ ప్లస్ గ్రేడ్ ఇస్తానని, 1001 మందిని మిత్రులుగా చేసుకుంటే 100కు 60 మార్కులు ఇస్తానని వెల్లడించారు. ఈ అసైన్‌మెంట్‌ను కొందరు విద్యార్థులు అవలీలగా చేస్తుంటే, మరికొందరు విద్యార్థులు అసైన్‌మెంట్ చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.