అందంతోపాటు అభినయం కలిగిన కుర్రకారు హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈమె హీరోయిన్గా కంటే.. రంగస్థలం చిత్రంలో జిగేల్ రాణి అనే ఐటమ్ సాంగ్ చేసి మంచి పాపులర్ అయింది. ఈ అమ్మడికి అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి.
దీనిపై ఆమె స్పందిస్తూ, జీవితంలో విజయాలను సాధించడం వెనుక.. అపజయాలను పొందడం వెనుక ఒక నిర్ణయమనేది తప్పకుండా ఉంటుందన్నారు. తీసుకున్న నిర్ణయమే జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుందని చెప్పారు. అలాంటి నిర్ణయం తీసుకోవడంలో తాను తొందర పడటం వల్లనే తన కెరియర్ ఇంతగా మందగించిందని చెప్పుకొచ్చింది.
‘మొహంజొదారో’ భారీ బడ్జెట్ చిత్రం. అగ్రకథానాయకుడు హృతిక్ రోషన్ సరసన ఛాన్స్.. అందువల్లనే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ సినిమా హిట్ అయితే కెరియర్‌కి తిరుగుండదని భావించి, రెండేళ్ల పాటు కాల్షీట్స్ కేటాయించినట్టు తెలిపారు. “అదే నేను చేసిన పెద్ద తప్పు. ఆ సినిమా పరాజయం పాలుకావడం.. నా కెరియర్‌పై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఆ సినిమాకి బదులుగా చిన్న సినిమాలు చేసినా బాగుండేదేమో. ఒక ఆర్టిస్ట్‌కి రెండేళ్ల కాలం ఎంత విలువైందనేది ఇప్పుడు తెలుస్తోంది” అంటూ తన మనసులోని మాటను వెల్లడించింది.