చంద్రబాబు పార్టీ ఇకలేదు.. జగన్‌కు ఒక్క ఛాన్సివ్వండి : హీరో మోహన్ బాబు

0
81

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ హీరో, వైకాపా నేత మోహన్ బాబు నిప్పులు చెరిగారు. ఆయన శనివారం విజయవాడ వైకాపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఇసుక, మట్టి.. ఇలా అన్నీ దోచేస్తారని ఆరోపించారు.

‘ఫినిష్ చంద్రబాబు పార్టీ, నో మోర్ చంద్రబాబు పార్టీ’ అని వ్యాఖ్యానించారు. ‘తెలుగుదేశాన్ని నమ్ముకున్న సోదరులారా! మళ్లీ మీకు ఈ టర్మ్ లేదు’ అని అన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బాగా చేయకపోతే ఇంకో టర్మ్‌లో ఆ పార్టీకి అవకాశమొచ్చినా చంద్రబాబుకు మాత్రం వద్దని సూచించారు.

అన్న ఎన్టీఆర్ కుటుంబంలోని వారు అమాయకులని, అందుకే, చంద్రబాబు వారిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దోచేశారని, లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటున్న ‘దొంగ’ అని ఆరోపించారు.

చంద్రబాబు పునాది కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. పైగా, చంద్రబాబు కంటే తానే టీడీపీలో సీనియర్ అని చెప్పారు. ఈ ఎన్నికలతో టీడీపీ ఇకపై ఉండదని ఆయన జోస్యం చెప్పారు. గతంలో ఎన్టీఆర్‌పై చంద్రబాబు పోటీ చేస్తానని చెప్పారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు లాక్కున్నారన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అమాయకులని, వారిని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఇపుడు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

చంద్రబాబుది కుటుంబ పాలన అని చెప్పారు. చంద్రబాబు మాటలు వింటే ఎవరైనా మునగాల్సిందేనన్నారు. అందువల్ల జగన్ మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్సివ్వాలని, ఆయన తనకు కూడా పరిపాలనా అనుభవం ఉందని నిరూపించుకుంటాడని అన్నారు. చంద్రబాబు దోచుకోవడానికి చివరకు ఇసుకను కూడా వదిలిపెట్టలేదని మోహన్ బాబు ధ్వజమెత్తారు.