తాటి బెల్లంతో మైగ్రేన్ నొప్పికి చెక్…

0
34

పూర్వకాలం చ‌క్కెర‌కు బ‌దులుగా తాటిబెల్లంను విరివిగా ఉపయోగించేవారు. ప్రస్తుత కాలంలో తాటి బెల్లం అనే మాట ఎక్కడ కూడా వినబడటం లేదు. నిజానికి తాటిబెల్ల ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చింది కాదు. సుమారుగా 100 సంవ‌త్స‌రాల కింద‌ట తాటి బెల్లం గురించి ఆయుర్వేద నిపుణులు ముఖ్య‌మైన విష‌యాల‌ను రాశారట‌.

ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం తాటి బెల్లం వాడ‌కం ప‌ట్ల అంద‌రూ ఆస‌క్తి చూపిస్తున్నారు. దీన్ని వాడ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* చిన్న పిల్ల‌లకు తాటిబెల్లం తినిపిస్తే వారు నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. వారికి కావ‌ల్సిన శ‌క్తి బాగా అందుతుంది.
* తాటిబెల్లంలో ఉండే ఔష‌ధ గుణాలు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడ‌తాయి. ఇందులో ఉండే ఐరన్ రక్త‌హీన‌త‌ను త‌గ్గిస్తుంది.
* తాటిబెల్లం రోజూ తిన‌డం వ‌ల్ల శ్వాసకోస నాళం, చిన్నపేగుల్లో చేరుకున్న విషపదార్థాలూ బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.
* దగ్గు, జలుబు, శ్వాసనాళ సమస్యలు, నివారించడంలో తాటిబెల్లం స‌హాయ పడుతుంది.
* తాటిబెల్లం తిన‌డం వ‌ల్ల మైగ్రేన్ త‌గ్గుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలో బాగా వేడి ఉన్న‌వారు తాటిబెల్లం తిన‌డం మంచిది.
* తాటిబెల్లంలో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉన్నాయి. ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, ఫాస‌ర్ప‌ర‌స్ ఉండడం వ‌లన మనకకు సంపూర్ణ పోష‌ణ అందుతుంది.