నా చెల్లెలు రోజమ్మకు మీ దీవెనలు కావాలి.. జగన్

0
64

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజాపై ప్రశంసలు కురిపించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని, అందుకు అందరి దీవెనలు కావాలని తమ పార్టీని గెలిపించాలని కోరారు.

చెల్లెమ్మ రోజా నగరి ప్రజలకు మేలు చేస్తుందనే నమ్మకం తనకు సంపూర్ణంగా వుందని.. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు తన చెల్లి రోజా ఇవ్వాల్సిందిగా పేరుపేరునా ప్రార్థిస్తున్నానని జగన్ అన్నారు. మన పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా రెడ్డన్న ఉన్నాడు.

అన్ని రకాలుగా మంచి చేస్తాడన్న నమ్మకం నాకు ఉంది. రెడ్డన్న మీద కూడా చల్లని దీవెనులు సంపూర్ణంగా మీరందరూ ఉంచాల్సిందిగా రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని జగన్ కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ‘నవరత్నాలు’కు కట్టుబడి ఉన్నానని, ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే వాటిని కచ్చితంగా అమలు చేస్తానని జగన్ పునరుద్ఘాటించారు.