జగన్ ఒక్క మాట చెబితే చాలు.. అది చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని ఆయన సతీమణి వైఎస్. భారతి అన్నారు. పైగా, తన భర్త జగన్ మోహన్ రెడ్డి పట్ల ఏపీ ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి డా.మూలె సుధీర్‌రెడ్డితో కలిసి రోడ్‌షో, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ భారతి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్ పాటుపడతారని వైఎస్ భారతి హామీ ఇచ్చారు.
ప్రచారంలో భాగంగానే వైఎస్ భారతి ఇంటింటికీ తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. తాము చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల్లో భారీ స్పందన వస్తుదన్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో భాగంగా వైఎస్ జగన్ ప్రవేశపెట్టనున్న నవరత్నాలు పథకాల ద్వారా ప్రజలందరికీ తప్పకుండా మేలు జరుగుతుందన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా ఆమె ఆరోపించారు.