నిక్ జోనాస్‌, వారి తమ్ముళ్ళతో ఎంజాయ్ చేస్తున్నా : ప్రియాంకా చోప్రా

0
49

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, అమెరికా సింగర్ నిక్ జోనాస్‌లు విడాకులు తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్త సంచలనమైంది. వీరి కాపురం మూణ్ణాల ముచ్చటేనంటూ ఆనేక మంది భావించారు. కొన్ని విషయాల్లో ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగా ప్రియాంక-నిక్ వివాహబంధానికి స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్లు ఓకే అనే ఇంగ్లీస్ మ్యాగజైన్ తన కథనంలో పేర్కొంది.

అయితే తాజాగా ఈ వార్తలను కొట్టిపారేసేలా.. ప్రియాంక పోస్ట్ చేసిన ఫొటో ఒకటి ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. జోనస్ బ్రదర్స్ నిర్వహించిన కన్సర్ట్ ఈవెంట్‌కు ప్రియాంక హాజరైంది.

ఈ సందర్భంగా జోనస్ బ్రదర్స్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నిక్ సోదరులతో నా మొదటి కార్యక్రమం. అద్భుతంగా జరిగింది. వారితో ఈవెంట్‌లో పాల్గొనడం గర్వంగా ఫీలవుతున్నానంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రియాంక పోస్ట్ చేసిన ఈ ఫొటోతో విడాకుల విషయం అంతా ఒట్టిదేనని స్పష్టమవుతోంది.

మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో జోనస్ బ్రదర్స్ ప్రదర్శనను ఆమె చాలా ఎంజాయ్ చేసిందట. పైగా, ఈ కార్యక్రమానికి నిక్ తల్లి డెనిస్ జోనస్‌తో పాటు తండ్రి కూడా హాజరయ్యాడు. మ్యూజికల్ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలను కూడా ఆమె షేర్ చేసింది.