మంచోడిని చూసి పెళ్లి చేసుకుంటా : సోనాక్షి సిన్హా

0
35

బాలీవుడ్ హీరో శత్రుఘ్నసిన్హా ముద్దులు కుమార్తె సోనాక్షి సిన్హా. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం లింగా. దీంతో పాటు.. దబాంగ్, రౌడీ రాథోడ్, ఓ మై గాడ్, దబాంగ్ 2, వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఇటీవలే తన పెళ్లి గురించి మనసులో మాట చెప్పింది. ఈమె జహీర్ ఇక్బాల్ అనే యాక్టర్‌తో సోనాక్షి డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న శిల్పాశెట్టి.. డేటింగ్ విషయంపై సోనాక్షిని అడగ్గా.. అలాంటిదేమి లేదని, తాను ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నానని సోనాక్షి చెప్పింది.

మీ ముగ్గురిలో ఎవరు ముందు పెళ్లి చేసుకోబోతున్నరని ప్రశ్నించగా.. తానే అంటూ సమాధానమిచ్చి సోనాక్షిసిన్హా. అంతేకాదు తన కోసం ఓ మంచి అబ్బాయిని వెతికిపెట్టాలని కోరింది. సరైన అబ్బాయి దొరికితే వెంటనే పెళ్లి చేసుకునేందుకు రెడీ అని చెప్పేసింది. దీంతో ఈ ఏడాది పెళ్లి పీటలెక్కబోయే హీరోయిన్ల జాబితాలో సోనాక్షి కూడా చేరే అవకశాముందంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.